తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ జరగనుంది. ఆరు నెలల్లోగా ఘటనపై న్యాయ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారికి రూ.25 లక్షలు పరిహారం అందజేసింది. అలాగే తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, గాయాలైనవారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందించారు.