తిరుపతిలో ఓ దొంగ కలకలం రేపాడు. లేడీస్ హాస్టల్‌లోకి రాత్రి పూట ప్రవేశించి సెల్ ఫోన్లు చోరీ చేశాడు. భవానీ సర్కిల్‌లోని రెండు హాస్టల్స్‌లో చోరీలకు పాల్పడ్డాడు. ఉదయాన్నే ఈ విషయాన్ని గుర్తించిన బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రాత్రి పూట దుండగుడు హాస్టల్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.