తిరుపతి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలుకు కోచ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ రైలుతోపాటు మరో 6 రైళ్లకు ఇప్పుడు ఉన్న కోచ్‌లకు అదనంగా మరో 4 కోచ్‌లను చేర్చనున్నట్లు తెలిపింది. అయితే వందే భారత్ రైళ్లకు.. ప్రయాణికుల నుంచి భారీగా స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.