తిరుపతి సమీపంలోని దామినేడులో మూడు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. మృతులను తమిళనాడుకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె, ఆమె మూడేళ్ల కుమారుడిగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో తిరుపతికి వచ్చిన సత్యరాజ్.. దామినేడు ఇందరమ్మ గృహ సముదాయంలో నివసిస్తున్నాడిని పోలీసులు చెప్పారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి వీరు బయటకు రాలేదు. ఈ క్రమంలో ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.