TTD Cancelled Tirumala Vip Break Darshan On September 13: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఈ రద్దీ ఇంకా పెరుగుతుందని అంచనా వేసిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.. శనివారం సిఫార్సు లేఖల్ని స్వీకరించారు. తిరుమల వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.