Dwaraka Tirumala Temple Gold Plating: ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. రూ.1,64,19,411 విరాళంతో బంగారు తాపడం చేయించగా.. శుక్రవారం ఆలయంలో అమర్చారు. దీపక్ నెక్స్‌జన్ ఫీడ్స్ సంస్థ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఈ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు ఆ విరాళ పత్రాన్ని దాత ఆలయ అధికారులకు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.