తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. అన్యమత చిహ్నం ఉన్న వాహనం.. తిరుమల కొండపైకి వెళ్లింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు.. దాన్ని గమనించి.. టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన టీటీడీ అధికారులు.. వెంటనే చర్యలు చేపట్టారు. ఆ కారుపై ఉన్న అన్యమత గుర్తుకు సంబంధించిన స్టిక్కర్ తొలగించారు. అనంతరం ఆ కారు డ్రైవర్, ఓనర్‌పై కేసు నమోదు చేశారు.