Tirumala Lost Handbag Returned To Devotee: తిరుమలకు వచ్చిన బెంగళూరు భక్తురాలు జ్యోత్స్న, దర్శనం క్యూలైన్‌లో హడావిడిగా తన బ్యాగు పోగొట్టుకుంది. అందులో రెండు లక్షలకు పైగా డబ్బు ఉంది. అదృష్టవశాత్తు, విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రాజీవ్ ఆ బ్యాగును గుర్తించి భద్రపరిచారు. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి, ఆమెకు బ్యాగును సురక్షితంగా తిరిగి అప్పగించారు. బెంగళూరు భక్తురాలు జ్యోత్న్స టీటీడీ భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.