TTD Cancels Reverse Tendering System: టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఈవో జే శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. దీంతో అదే విధానాన్ని అనుసరిస్తూ తాజాగా టీటీడీ ఈవో కూడా చర్యలు చేపట్టారు. గత ఐదేళ్లలో టీటీడీలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.