తిరుమల నుంచి గంట ముందే బయల్దేరండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

4 months ago 21
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి తిరుపతికి వచ్చే వాహనాలు నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలలో దర్శనం అనంతరం భక్తులు గంట ముందుగానే తిరుపతికి బయల్దేరాలని టీటీడీ సూచించింది. రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టు, బస్టాండ్లకు వెళ్లే భక్తులు ముందస్తుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article