తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే నెల 7వ తేదీన ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించింది. చంద్ర గ్రహణం కారణంగా.. శ్రీవారి ఆలయం మూసివేస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆ రోజున తిరుమలలో పలు సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమలలో అన్న ప్రసాద వితరణను కూడా నిలిపివేస్తామని.. అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.