తిరుమల లడ్డూ కల్తీ కేసును మరో రాష్ట్రానికి మార్చాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

1 hour ago 1
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణను ఏపీ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో నిందితుడైన మచీంద్ర శాంతారాం లంకే దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పక్కన పెట్టింది. రాష్ట్రంలోని రాజకీయ వ్యాఖ్యల కారణంగా నిష్పక్షపాత విచారణకు ఆటంకం కలగవచ్చని ఆయన తరఫు లాయర్ వాదించారు. అయితే సాక్షులు ఎక్కువగా ఏపీకి చెందినవారని.. సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇప్పటికే దర్యాప్తు చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. బదిలీకి సరైన కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
Read Entire Article