బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్

2 hours ago 2
మహిళా కండక్టర్ ప్రవళిక మృతి నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల భద్రతపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక తలుపులు ఉన్న బస్సులు వాటిని పూర్తిగా మూసిన తర్వాతే ప్రయాణం ప్రారంభించాలని స్పష్టం చేసింది. బస్సుల్లో డోర్ల పనితీరును అధికారులు తనిఖీ చేయడంతో పాటు, లోపాలుంటే మరమ్మతులు చేయించాలని సూచించింది. పల్లె వెలుగు నుంచి స్లీపర్ సర్వీసుల వరకు డోర్లు ఉన్న బస్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. కొత్త మార్గదర్శకాల అమలుపై నివేదికలను ఈనెల 7లోగా సమర్పించాలని ఆర్టీసీ ఆదేశించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను మెరుగుపరచడమే ఈ చర్యల లక్ష్యమని పేర్కొంది.
Read Entire Article