వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం టీటీడీ శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. తిరుపతిలోని 8 కేంద్రాలు, తిరుమలలో ఒక చోట ద్వార దర్శనాల టోకెన్లు జారీ చేయనున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఈ టోకెన్లు జారీ చేయనుండగా.. బుధవారం సాయంత్రం నుంచి కేంద్రాల వద్ద భక్తులు తాకిడి పెరిగింది. ఈ క్రమంలోనే తిరుపతి విష్ణు నివాసం కేంద్రం వద్ద జరిగిన తోపులాటలో తమిళనాడులోని సేలంకు చెందిన ఓ మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది.