Swachh Award For Tirumala Temple: విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు అందించారు. ఆలయాల కేటగిరీలో తిరుమల శ్రీవారి ఆలయానికి మొదటి స్థానం దక్కింది. అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయం, సింహాచలం ఆలయానికి ఆ తర్వాత స్థానంలో అవార్డులు దక్కాయి. ఇటు టీటీడీ పరిధిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి కూడా ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026 వచ్చింది.