తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పా్ట్లు చేపడుతోంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ సీవీఎస్‌వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల సౌలభ్యం కోసం ముఖ్యమైన ప్రాంతాలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.