ఆరోగ్యం విషయంలో ఆహారానిదే కీలక పాత్ర. అందుకే వీలైనంత వరకు తాజా కూరలు, పండ్లు, కల్తీ లేని ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తాం. కానీ, తాగే నీళ్లు నుంచి ప్రతిదీ కల్తీమయంగా మారిపోయింది. ప్రమాదకర రసాయనాలతో కల్తీ నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటివి తయారు చేసి దుకాణాలకు అంటగడుతున్నారు. ఇవి కేవలం వీటికి పరిమితం కాలేదు. పాలు లేకుండా నెయ్యి తయారుచేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చింది. తాజాగా, మరో దందా బయటపడింది. పాలు లేకుండా రసాయనాలతోనే పన్నీర్ తయారుచేస్తున్నవారి గుట్టరట్టయ్యింది.