తిరుమలలో చక్రతీర్థ ముక్కోటికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 12వ తేదీన చక్రతీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఏటా కార్తీకమాసంలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ నెల 12న చక్రతీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఆ రోజు చక్రతీర్థంలో అభిషేకం, పుష్పాలంకారణ, ఆరాధనలు నిర్వహిస్తారు. మరోవైపు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం లడ్డూ కౌంటర్‌ను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి తిరుపతి లడ్డూలపై వారి అభిప్రాయం తెలుసుకున్నారు.