APSRTC Tirumala Arunachalam Tour: ఏపీ ప్రజల కోసం ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది! రాజమహేంద్రవరం డిపో నుంచి అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. కేవలం నాలుగు రోజుల్లో మూడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. కాణిపాకం వినాయకుడు, అరుణాచలేశ్వర స్వామి, తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనాలతో మీ మనసు పులకించిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ టికెట్ బుక్ చేసుకోండి! వివరాల కోసం ఆర్టీసీని సంప్రదించండి.