Tirumala Devotional Books As Prasadam: టీటీడీ ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది! ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఆధ్యాత్మిక భావనలు పెంచేందుకు, ధర్మం గురించి తెలియజేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. గోవిందరాజ స్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ట వైభవంగా జరిగింది. కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి.