Tirumala Darshan Through WhatsApp: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ముందుగా తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టింది. అయితే తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల తర్వాత టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేసి.. ఆ తర్వాత ఈ వాట్సాప్ దర్శన టికెట్లు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. తిరుమలతో పాటుగా రాష్ట్రంలో మిగిలిన ఆలయాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు.