Tirumala TTD Hotels Rent Reduced: తిరుమలలో ప్రైవేట్ హోటళ్ల అద్దెలను తగ్గిస్తూ, గడువును ఐదేళ్లకు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హోటళ్ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది, అర్హులైన హిందువులకు అవకాశం కల్పిస్తోంది. శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుంచి జూలై 2 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు జరగనున్నాయి. జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 3న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.