TTD No Special Darshans During Brahmotsavams: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి తెలిపారు. అక్టోబరు 8న జరిగే గరుడసేవ కోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గరుడ సేవను పురస్కరించుకొని అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.