Tirumala Vip Break Darshan Cancelled During Festivals: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్! డిసెంబర్, జనవరి నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి వంటి పర్వదినాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈవో సింఘాల్ టీటీడీ ట్రస్ట్‌లపై సమీక్ష నిర్వహించి, విద్యార్థుల వికాసానికి, ఆసుపత్రులలో మందుల కొరత నివారణకు చర్యలు సూచించారు.