Ttd On Umbrella Procession Donations: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నై నుంచి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. తమిళనాడులో తిరుముల్లైవాయల్, తిరువళ్లూర్ మీదుగా సాగే ఊరేగింపు ఈ నెల 7వ తేది తిరుమలకు చేరుకుంటుంది. అయితే గొడుగులు ఊరేగింపుకు సంబంధించి టీటీడీ కీలకమైన అప్డేట్ ఇచ్చారు. భక్తులెవరూ గొడుగుల ఊరేగింపులో ఎలాంటి కానుకలు అందించొద్దని టీటీడీ సూచించింది. మరోవైపు మంగళవారం రోజు తిరుమలలో జరిగే గరుడ సేవ కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.