Tirumala Darshan Rs 300 Tickets And Accommodation Release: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. శుక్రవారం రోజు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అంతేకాదు తిరుమల, తిరుపతిలో వసతి గదుల ఏప్రిల్ నెల కోటాను కూడా విడుదల చేయనుంది. భక్తులు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.