Tirumala Darshan Tickets And Accommodation: తిరుమల శ్రీవారి డిసెంబర్ నెల దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వయోవృద్ధులు, దివ్యాంగుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అలాగే, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది, భక్తులు సెప్టెంబర్ 18 నుండి 20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.