TTD AI Based Machines For Anna Prasadam Quality: తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూల నాణ్యతను మెరుగుపరచడానికి టీటీడీ కీలక ముందడుగు వేసింది. 'విజన్ బేస్డ్ సార్టింగ్ యంత్రాలను' అందుబాటులోకి తెచ్చింది. ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ అధునాతన యంత్రాలు నిత్యావసర సరుకుల్లోని లోపాలను గుర్తించి, నాణ్యత లేని వాటిని వేరు చేస్తాయి. టీవీఎస్ సంస్థ విరాళంగా ఇచ్చిన ఈ యంత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీనివల్ల భక్తులకు 100 శాతం నాణ్యమైన ప్రసాదాలు అందుతాయి.