తిరుమలలో శ్రీవారి సేవ చేసుకోవడం అంటే ఎంత పవిత్రంగా భావిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా ప్రొఫెషనల్స్‌కి కూడా టీటీడీ శ్రీవారి సేవ అవకాశాన్ని కల్పించింది. వైద్య సేవ కింద జూన్ 5న టీటీడీ పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్పెషలిస్ట్ వైద్యులు, ఎంబీబీఎస్ వైద్యులు తిరుపతిలోని పలు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో భవిష్యత్తులో శ్రీవారి విద్యా సేవ, ఇంజినీరింగ్ సేవ, రక్షణ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.