Tirumala Devotees Donated Rs 63 Lakhs To TTD: తిరుమల శ్రీవారికి మరోసారి భారీగా విరాళాలు అందాయి. తిరుమల శ్రీవారి పేరుతో నడుస్తున్న అన్నప్రసాద ట్రస్ట్‌కు గూడూరుకు చెందిన భక్తుడు రూ.33 లక్షలు ఇచ్చారు. అలాగే ఒంగోలుకు చెందిన మరో భక్తుడు ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు అందజేశారు.