Tirumala Jaipur Devotee Aarti Bindal Donated Rs 51 lakhs Gold Jewels: తిరుమలలో శ్రీవారికి రాజస్థాన్ జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు ఖరీదైన కానుకల్ని అందజేశారు. రూ.51.55 లక్షల విలువైన రత్నాలు పొదిగిన బంగారు పతకం, ముత్యాల హారం (నెక్లెస్ పెండెంట్)ను భక్తిశ్రద్ధలతో విరాళంగా అందజేశారు. ఆర్తి బిందాల్ దంపతులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి ఆభరణాలు అందజేశారు. అలాగే తిరుమల శ్రీవారి పేరుతో నిర్వహించే ట్రస్టులకు పలువురు భక్తులు విరాళాలు అందించారు.