Lavu Rathaiah Rs 1 Crore Donation To TTD: తిరుమల శ్రీవారికి భక్తులు భారీ విరాళాలు అందిస్తున్నారు. తాజాగా గుంటూరు విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. మరోవైపు, వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8 వరకు కొనసాగుతాయి. శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాల్లో శ్రీ సుబ్రమణ్య స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణరథోత్సవం కూడా వైభవంగా జరిగింది.