Tirumala Six Devotees Donated Rs 10 Lakhs Each: తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు అందుతున్నాయి. అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.60 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా వచ్చాయి. మరోవైపు, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ సమీక్ష నిర్వహించింది. భద్రతా ఏర్పాట్లు, భక్తులకు అవగాహన కల్పించడంపై అధికారులు దృష్టి సారించారు. బ్రహ్మోత్సవాల తరహాలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచనలు వెలువడ్డాయి.