Tirumala Rs 50 Lakh Donated To TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు విరాళాలు కానుకలు అందిస్తుంటారు. గత కొంతకాలంగా స్వామివారికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ మేరకు తాజాగా టీటీడీకి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఏకంగా రూ.50 లక్షలు అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు అందజేశారు. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవోను కలిసి చెక్‌ను దాత అందజేశారు.