ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ తనయడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. వీటితో పాటు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే భరించనుంది. మరోవైపు.. వీకెండ్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పడుతుండటంతో టీటీడీ సోమవారం నాటి వీఐపీ, శ్రీవాణి దర్శనాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.