Nanded Tirupati Express Train 07189: తిరుమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాందేడ్ నుండి తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. జూలై 4 నుండి 25 వరకు ప్రతి శుక్రవారం నాందేడ్‌లో సాయంత్రం 4:30 గంటలకు రైలు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో జూలై 5 నుండి ప్రతి శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.