TTD Cancelled Sri Srinivasa Divyanugraha Homam Tickets: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ వేకువజామున 4.30 గంటలకు వైకుంఠ ద్వారదర్శనాలకు అనుమతిస్తున్నారు. అయితే ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటూ అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేసింది. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ భక్తులకు సూచించింది.