టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకుని.. 2023 జనవరి 27వ తేదీన కుప్పం నుంచి యుగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. 226 రోజులపాటు సాగిన పాదయాత్ర అదే ఏడాది డిసెంబర్ నెలలో ముగిసింది. అయితే, నేటితో ఆ పాదయాత్రకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీధర్ వర్మ, ఇతర టీడీపీ నాయకులు తిరుమలలో టెంకాయలు కొట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. 226 రోజుల పాదయాత్రకు గుర్తుగా స్వామివారికి 226 టెంకాయలతో మొక్కు చెల్లించుకున్నారు.