Tirumala Helmet Mandatory Rule: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది.. రాష్ట్రంలో హెల్మెట్ తప్పనసిరి చేస్తూ నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఇటీవల కాలంలో హెల్మెట్ ధరించక రోడ్డు ప్రమాదంలో 667మంది చనిపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తిరుమలలో కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారుల భద్రత కోసమే ఈ నిర్ణయం అంటున్నారు. ఈ క్రమంలో కొండపై హెల్మెట్‌లు ధరించాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ నిబంధనను అమలు చేయనున్నారు.