Chaganti Koteswara Rao | ప్రవచనకర్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర రావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్‌లో ఓ ఛానెల్‌లో పోస్టు చేసిన వీడియో కారణంగా ఈ వార్తలు వ్యాప్తి చెందాయి. అదేవిధంగా తిరుమలలో చాగంటి కోటేశ్వర రావు ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమాన్ని సైతం టీటీడీ రద్దు చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. ఇంతకీ తిరుమలలో చాగంటి పర్యటన సందర్భంగా ఏం జరిగింది? వివరాలు..