తిరుమల వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక. ఆగస్ట్ నెలలో తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్ట్ 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులు పలు ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆగస్ట్ 22వ తేదీ పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.