TTD Tirupati Balaji Free Darshan Scheme: తిరుమల శ్రీవారి దర్శనంపై వృద్ధులకు ఉచిత పథకం ప్రారంభమైందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఈ వార్తలను ఖండించింది. వృద్ధుల కోసం ఎలాంటి కొత్త ఉచిత దర్శన పథకం ప్రారంభించలేదని స్పష్టం చేసింది. భక్తులు టీటీడీ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హైదరాబాద్‌లోని టీటీడీ ఆలయాలను పరిశీలించారు.