TTD Plans To Rename Tirumala Streets: తిరుమలలో వీధులకు, రహదారులకు పేర్లు పెట్టాలని టీటీడీ గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయగా.. కొన్ని పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేవతామూర్తులు, ఆళ్వార్లు, రాజులు, పురాణ గ్రంథాలకు సంబంధించిన పేర్లు పెట్టనున్నారు. త్వరలో జరగబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.