Tirumala Vaikunta Dwara Darshan Cm Revanth Reddy: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పది రోజుల పాటు కొనసాగే ఈ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనవరి 2 నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.