Tirumala Garuda Seva, Tirumala Srivari Pushkarani Devotees Allowed From 3 AM: తిరుమలలో శనివారం నిర్వహించే గరుడ సేవ కోసం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. శనివారం వేకువజామున 3 గంటల నుంచే భక్తుల్ని తిరుమలలోని స్వామివారి పుష్కరణిలో స్నానమాచరించేందుకు అనుమతిస్తారు. తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. వాస్తవానికి తిరుమలలో ప్రతిరోజూ భక్తుల్ని ఉదయం 6 గంటలకు స్వామివారి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. గరుడ సేవ రోజు రద్దీ దృష్ట్యా శనివారం మాత్రం వేకువజాము 3 గంటల నుంచి అనుమతిస్తారు.