అమరావతిలో కీలకమైన నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఈ మార్గంలోని న్యూ పిడుగురాళ్ల - శావల్యాపురం స్టేషన్ల మధ్య తొలిసారిగా రైలు కూత పెట్టనుంది. ఇప్పటి వరకూ ఈ మార్గంలో కేవలం గూడ్స్ రైళ్లే రాకపోకలు సాగించగా.. జులై 4 నుంచి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. జులై 4 నుంచి జులై 26 వరకూ నాందేడ్ తిరుపతి ప్రత్యేక రైలు ఈ మార్గంలో రాకపోకలు సాగించనుంది. అయితే శావల్యాపురం రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్ లేకపోవటంతో..రైలు నిలిపేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.