గుంటూరు జిల్లాలోని మంచికలపూడి ఆర్‌యూబీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే గేటు కారణంగా వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమయ్యేవారు. ఈ నేపథ్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించి.. గురువారం నుంచి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆరు నెలల పాటు మంచికలపూడి గేటు మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచిస్తున్నారు.