ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుమారు ఐదు నెలల పాటు తీహార్ జైలులో ఉన్న కవిత.. తన జైలు అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తీహార్ అంటే కేవలం కరుడుగట్టిన నేరస్థులు మాత్రమే ఉంటారని అందరూ భావిస్తారని.. కానీ అక్కడ చాలా చిన్న కేసుల్లో చిక్కుకున్న వారు, అమాయకులు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. అరటిపండు దొంగతనం చేసిన వారు, భార్యాభర్తల గొడవలు వంటి పెట్టీ కేసుల వల్ల ఏళ్ల తరబడి జైలులో మగ్గుతున్న వారిని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమె వెల్లడించారు.