ఏపీలో మొంథా తుఫాన్ తీవ్ర నష్టం కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే నష్టాన్ని అంచనా వేయడానికి, బాధితుల వివరాలను సేకరించడానికి ప్రభుత్వం 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్‌ను ఉపయోగించడానికి సిద్ధమైంది. దీని ద్వారా మొంథా తుఫాన్ కలిగించిన నష్టాన్ని బాధితులే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లొచ్చు. మరోవైపు, మొంథా తుఫాన్‌ను టెక్నాలజీతో సమర్థంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు రూ.5,265.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.