తూర్పుగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన రైతులకు మంత్రి కందుల దుర్గేష్ శుభవార్త వినిపించారు. ఎర్రకాలువ ముంపు కారణంగా నష్టపోయిన రైతులకు త్వరలోనే ఇన్‌పుట్ సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని మంత్రి వెల్లడించారు.